William Harvey - Biography, Facts and Pictures - Famous Scientists

William Harvey - Biography, Facts and Pictures - Famous Scientists

William Harvey - Biography, Facts and Pictures - Famous Scientists
విలియం హార్వే

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త అయిన విలియం హార్వే ఏప్రిల్ 1,1578న ఇంగ్లాండులో జన్మించాడు. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని శతాబ్దాల క్రితమే వివరించి వైద్యులకు మార్గదర్శకుడయ్యాడు. అప్పటి ఇంగ్లాండు రాజు మొదటి చార్లెస్ ఆస్థాన వైద్యుడిగానూ హార్వే పనిచేశాడు. ఉన్నత కుటుబంలో జన్మించిననూ ఎలాంటి విలాసాల జోలికి వెళ్ళకుండా గుండెకు సంబంధించిన పరిశోధనలో నిమగ్నుడై వైద్యరంగంలో చిరస్మరణీయుడైన హార్వే జూన్ 3, 1657న మరణించాడు.


బాల్యం, అభ్యసనం:
విలియం హార్వే ఇంగ్లండులోని ఫోక్‌స్టోన్‌లో 1578 ఏప్రిల్‌ 1న సంపన్నుడైన పట్టణ మేయరుకు పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టాడు. కేంబ్రిడ్జిలో పట్టభద్రుడయ్యాడు. ఆపై వైద్య విద్య కోసం ఇటలీలోని వెళ్ళి అక్కడ హరోనిమస్ ఫాబ్రీసియస్ అనే ప్రముఖ వైద్య శాస్త్రజ్ఞుని వద్ద శిష్యునిగా చేరాడు. 1602 లో వైద్య శాస్త్రంలో పట్టాను మరియు యోగ్యతా పత్రాన్ని పొందగలిగాడు. అక్కడి నుంచి లండన్‌ తిరిగి వచ్చాక ఇంగ్లాండు రాజు మొదటి ఛార్లెస్‌ కొలువులో ఆస్థాన వైద్యుడిగా నియమితుడయ్యాడు. 1615 లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ లో లెక్చరర్ గా నియమింప బడ్డాడు.

పరిశోధనలు:
చేపలు, కప్పలు,కోళ్ళ పిండాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటి రక్త ప్రసరణ గురించి ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. గుండె ముడుచు కోవటం వల్ల రక్తం ధమనుల ద్వారా రక్త నాళాలకు వెళుతుందని తెలుసుకున్నాడు. నాడి కొట్టుకోవడం అంటే గుండె కొట్తుకోవడమే అని రుజువు చేశాడు. మనిషి గుండెలో నాలుగు గదులు ఉంటాయని తెలుసుకున్నాడు. చనిపోయిన ఖైదీల శరీరాలను అడుగడుగునా పరిశీలించడం ద్వారా గుండె ఒక పంపులాగా పనిచేస్తుందని, శరీరంలో సిరలు, ధమనుల ద్వారా రక్తం వలయాకారంలో ప్రవహిస్తుందని తెలుసుకున్నాడు. మనిషి గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్‌ చేస్తుందో చెప్పగలిగాడు. తన పరిశీలనలతో రెండు అమూల్యమైన గ్రంథాలను వెలువరించాడు.

గ్రంథాలు:
క్రీ.శ 1628 లో హార్వే ప్రచురించిన అనటామికల్ ఎక్సర్ సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్లడ్ అనే పుస్తకం వైద్య శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది. పరిశోధనల ద్వారా వచ్చిన ఫలితాలను మళ్ళీ పరిశోధనల ద్వారానే రూఢి పరచాలనే శాస్త్రవాది హార్వే. ఈ పుస్తకం ప్రచురించిన మూడు సంవత్సరాల తరువాత హార్వే మొదటి చార్లెస్ మహారాజుకు రాజ వైద్యునిగా నియమించబడ్డాడు. కానీ రాజకీయ విపరిణామాల కారణంగా హార్వే లండన్ విడిచి పెట్టవలసి వచ్చింది. అప్పుడే కొంతమంది దుండగులు హార్వే ఇంటిలో లేని సమయం చూచి ఆయన నాలుగు దశాబ్దాలుగా సేకరించిన దాచుకున్న అమూల్యమైన విజ్ఞాన సంపద నంతా నాశనం చేశారు. అయినా హార్వే బాధ పడలేదు. నిరాశతో క్రుంగిపోలేదు. ప్రత్యుత్పత్తి, పిండాభివృద్ధి అంశాల మీద జీవితమంతా పరిశోధించాడు. 1651 లో "ఎక్సర్ సైజస్ ఆన్ ది జనరేషన్ ఆఫ్ ఆనిమల్స్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకం ప్రతులు అతి త్వరితగతిలో అమ్ముడైపోయి కొత్త చరిత్రను సృష్టించాయి.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url